షర్మిలది పాదయాత్ర కాదు, శవయాత్ర: శోభా హైమవతి

షర్మిల చేసేది పాదయాత్ర కాదని, శవయాత్ర అని ఆమె వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్రలో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా విలువైన భూములు, గనులు ఎక్కుడున్నాయో తెలుసుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని దోచుకున్నారని ఆరోపించారు. దమ్ముంటే చంద్రబాబు లాగా షర్మిల తన కుటుంబ సభ్యుల ఆస్తులు ప్రకటించాలని ఆమె అన్నారు.
షర్మిల పాదయాత్రపై కాంగ్రెసు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా విరుచుకుపడ్డారు. షర్మిల పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు గతంలో కుమ్మక్కయి తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినా తమకేమీ ఇబ్బంది లేదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేసిన డిమాండ్‌ను ఆయన తప్పు పట్టారు.
తన ఉనికిని చాటుకునేందుకే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టారని గండ్ర మండిపడ్డారు ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టినా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ముప్పేమీ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు ఏనాడూ రైతుల గురించి ఆలోచించలేదని అన్నారు.












Click it and Unblock the Notifications