మేం చెప్తాం: ఆజాద్ తెలంగాణపై ప్రకటనపై కోదండరామ్

తెలంగాణపై సంప్రదింపుల తర్వాత శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని విమర్శించారు. తెలంగాణ రాకపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని దుయ్యబట్టారు. తెలంగాణపై సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదని, సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.
పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలో తలెత్తిన సమస్యలను ప్రభుత్వాలే పరిష్కరించాయని ఆయన గుర్తు చేశారు. ఎవరో రాష్ట్రం ఇస్తారని ప్రజలు ఎదురు చూడకూడదని, ఉద్యమాల ద్వారా తెచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కన్నా ఉధృతమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు.
తెలంగాణపై ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో చర్చించుకుంటామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏకాభిప్రాయం లేదనే మాటలను 2009 డిసెంబర్ 9వ తేదీకి ముందే చెప్పి ఉండాల్సిందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తమ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు కాబట్టి తమ పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై తాము మాట్లాడడం లేదని అన్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ శనివారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని, తెలంగాణ సమస్యను సత్వరమే పరిష్కరించాలని తాను సోనియాతో అన్నట్లు బలరాం నాయక్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.












Click it and Unblock the Notifications