నేను హైదరాబాదీని, ఇక్కడే పుట్టి పెరిగా: సిఎం

దేశంలో శాంతిని నెలకొల్పేందుకు గతంలో రాజీవ్ గాంధీ చేసిన సద్భావనా యాత్ర భారతీయులందరినీ ఏకతాటి మీదికి తీసుకుని వచ్చిందని ఆయన అన్నారు. పాతబస్తీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. హైదరాబాద్ పాతబస్తీ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
వంద ఎకరాల్లో పాతబస్తీలో గృహ నిర్మాణ సముదాయాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అక్షరాస్యతలో మన రాష్ట్రం చాలా వెనకబడి ఉందని, అక్షరాస్యతను పెంచడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.
అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్ వేదికగా మారిందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హైదరాబాద్ అభివృద్ధిని కొనియాడారని ఆయన గుర్తు ేచశారు. వచ్చే ఏడాది ప్రపంచ వ్యవసాయ సదస్సు కూడా హైదరాబాదులోనే జరుగుతుందని ఆయన చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో తెలంగాణ న్యాయవాదుల జెఎసి నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications