కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిల 'బాణం'పై టిడిపి కౌంటర్: ఏసు జైలుకు పంపారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajendra Prasad
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బాంబులు వదిలి బాణాలు తెచ్చారని తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం ఎద్దేవా చేశారు. షర్మిల గురువారం పాదయాత్ర ప్రారంభంలో తాను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై రాజేంద్ర ప్రసాద్ ఈ రోజు ఎద్దేవా చేశారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిని సహించలేక ఆ ఏసుక్రీస్తుయే ఆతనిని జైలులో పెట్టించాడని విమర్శించారు. షర్మిల, విజయమ్మలు బైబిల్ చేతపట్టుకొని పాదయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాలలోకి మతాన్ని తీసుకు రావొద్దని హితవు పలికారు. జగన్ తాను అక్రమంగా సంపాదించిన ఆస్తిని రాష్ట్రంలోని చర్చిలకు ఉదారంగా ఇస్తే బాగుంటుందని రాజేంద్ర ప్రసాద్ ఆ పార్టీకి హితవు పలికారు.

వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కండరాల నొప్పితో బాధపడుతున్నారని అన్నారు. పాదయాత్రలో విశ్రాంతి తీసుకునేందుకు ఆయన ససేమీరా అంటున్నారని చెప్పారు. దసరా పండుగకు సైతం పాదయాత్రను తాత్కాలికంగా ఆపేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని చెప్పారు. చంద్రబాబు పద్దెనిమిదవ రోజు పాదయాత్ర కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుండి ప్రారంభమయింది.

కాగా గురువారం రాత్రి చంద్రబాబు నాయుడుకు కాళ్లు బాగా నొప్పులు లేచాయి. కండరాలు పట్టాయి. దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం పాదయాత్రకే మొగ్గుచూపారు. ఉదయానికల్లా కాలి నొప్పులు తగ్గాయి.

English summary
TDP responded on YSR Congress party chief YS Jaganmohan Reddy's sister Sharmila's arrow comment on Friday. TDP MLC Rajendra Prasad said YS Jagan left bombs and using now arrows.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X