శ్రీనగర్ వద్ద టెర్రరిస్టుల కాల్పులు: ఒకరి మృతి

పరింపోరా - పంథాచౌక్ బైపాస్ రోడ్డు మీద ఉన్న లస్జాన్ సమీపంలోని సిల్వర్ స్టార్ హోటల్ సమీపంలో ఉగ్రవాదాలుపై ఆర్మీ కాన్వాయ్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం గం. 4.20 నిమిషాలకు జరిగింది.
హోటల్ బెల్ బాయ్ మరణించగా, మరో ఇద్దరు ఈ కాల్పుల్లో గాయపడ్డారు. సైనిక వాహనం కాల్పుల్లో ధ్వంసమైంది. సైనిక సిబ్బంది ప్రాణాలకు ఏ విధమైన నష్టం వాటిల్లలేదు. ఈ ఏడాది మేలో ఖన్యార్‌లో సిఆర్‌పిఎఫ్ సిబ్బందిపై కాల్పులు జరిపిన తర్వాత అటువంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి.
భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు 20 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications