జగన్ పుణ్యమే: భూమన, 'జైలుకెందుకెళ్లాడో తెలియదా'

ఈ నెల 8వ తేది నుంచి కర్నూలు జిల్లాలో వైయస్ జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయలేదని, కానీ ఇప్పుడు అధికారం కోసం ఆయన వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్రతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారన్నారు. ఆయనను ఎవరూ నమ్మడం లేదన్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు ఎందుకు వెళ్లారో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియదా అని రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వేరుగా అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర కొనసాగితే తమ పార్టీలకు ఎక్కడ నూకలు చెల్లిపోతాయో అనే భయంతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ఆయనను జగన్‌ను జైలుకు పంపించాయన్నారు.
జగన్‌ను జైలులో పెట్టి కిరణ్ ఇందిర బాట, చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్రలు కొనసాగిస్తున్నారని, ఇది కుట్రలో ఓ భాగం అన్నారు. రాష్ట్రంలో విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైయస్సార్ కాంగ్రెసు మాత్రమే అన్నారు.












Click it and Unblock the Notifications