ఒకేరోజు జిల్లాలు దాటనున్న షర్మిల, చంద్రబాబు

పాలమూరు జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలో పాదయాత్ర అనంతరం చంద్రబాబు రంగారెడ్డి జిల్లాలోని పరిగి మండలంలోకి ప్రవేశిస్తారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోకి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు జిల్లాకు చెంది పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడి మృతి, బాబుకు అనారోగ్యం, నీలం తుఫాను కారణంగా మహబూబ్ నగర్ జిల్లాలో బాబు యాత్ర మూడుసార్లు వాయిదా పడటంతో రంగారెడ్డి జిల్లా ప్రవేశం ఆలస్యమైంది.
మరోవైపు షర్మిల పాదయాత్ర ఈ రోజు అనంతపురం జిల్లా నుండి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనుంది. గత నెల 18వ తేదిన షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఇప్పటి వరకు కడప, అనంతపురం జిల్లాలో సాగింది. గురువారం ఉదయం అనంతపురం జిల్లాలో యాత్ర ప్రారంభించే షర్మిల మధ్యాహ్నం తర్వాత కర్నూలు జిల్లాకు చేరుకుంటారు. జిల్లాలోని మద్దికెరలో కర్నూలులో అడుగుపెడతారు.












Click it and Unblock the Notifications