ఎటెళ్లమంటే అటు: ఎపి రాజకీయాలపై జయప్రద కన్ను

సినిమాలు అంటే తనకు ఇష్టమేనని, అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్నానని చెప్పారు. ఏ పార్టీలో చేరుతారని మీడియా ప్రశ్నించగా.. ప్రజలు ఎటువైపు వెళ్లమని చెబితే తాను అటు వైపుకు వెళ్తానని చెప్పారు. అయితే ప్రస్తుతం తాను ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నందున ఇక్కడ ఉంటాను... అక్కడ ఉంటానని ఇప్పుడే చెప్పడం సరికాదన్నారు. అయితే తన మనసు మాత్రం ఆంధ్ర ప్రజలకే అంకితమన్నారు.
కాగా జయప్రద రాష్ట్ర రాజకీయాలపై గత కొన్నాళ్లుగా దృష్టి సారిస్తున్నారు. కొంతకాలం క్రితం తిరుపతి వచ్చిన ఆమె రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. అప్పుడే ఆమె యుపి నుండి ఎపికి తిరిగి వస్తారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఎనిమిది నెలల క్రితం తిరుమల వచ్చిన ఆమె టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మంచి నాయకుడని, గతంలో మంచి పాలన అందించారని కితాబు ఇచ్చారు.
అంతేకాదు తాను చంద్రబాబుకు దూరంగా ఉన్నంత మాత్రాన ఆయనను వ్యతిరేకించినట్లా అని చెప్పారు. తన రాజకీయ జీవితం రాష్ట్రం నుంచే ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో రాజకీయ రంగప్రవేశానికి భగవంతుడ్ని వేడుకుంటానని చెబుతూ.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరోవైపు బాలకృష్ణ పైనా ఆమె స్పందించారు. బాలయ్య అంటే తనకు ప్రత్యేక అభిమానమని, ఆయన ఎప్పుడు పిలిచినా తాను వెళ్లి మద్దతు పలుకుతానని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబంతో మంచి అనుబంధం ఉందని చెప్పారు. అయితే ఆ తర్వాత నేతల పాదయాత్రలపై కూడా ఆమె కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications