జగన్‌పై అటాక్ ప్రారంభించిన కోట్ల: షర్మిల యాత్రపై ఫైర్

షర్మిల పాదయాత్ర ఈ రోజు అనంతపురం జిల్లా నుండి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనున్న విషయం తెలిసిందే. గత నెల 18వ తేదిన షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఇప్పటి వరకు కడప, అనంతపురం జిల్లాలో సాగింది. గురువారం ఉదయం అనంతపురం జిల్లాలో యాత్ర ప్రారంభించే షర్మిల మధ్యాహ్నం తర్వాత కర్నూలు జిల్లాకు చేరుకుంటారు. జిల్లాలోని మద్దికెరలో కర్నూలులో అడుగుపెడతారు.
షర్మిల పాదయాత్ర తన జిల్లాలోకి అడుగుపెట్టనున్న సమయంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆమె పాదయాత్రపై విమర్శలు చేయడం గమనార్హం. రాయలసీమ జిల్లాల్లో వైయస్ జగన్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకే కాంగ్రెసు పార్టీ కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి కట్టబెట్టిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కోట్ల బుధవారం కూడా మాట్లాడుతూ... దివంగత వైయస్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చలువతోనే పనిచేశారన్నారు. ఆయన హయాంలో కేంద్రం ఇచ్చిన నిధులతో రాష్ట్రంలో చేసిన పనులను తమ తండ్రి చేసినవిగా వైయస్ సంతానం చెప్పుకోవడం సరికాదన్నారు. రాజకీయాల్లో తన తండ్రి విజయ భాస్కర్ రెడ్డి తెచ్చుకున్న నిజాయితీ పేరును నిలబెడతానని చెప్పారు.












Click it and Unblock the Notifications