• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాలి'ట్రిక్': మన నేతలు ఇలా అమెరికా నేతలు అలా

By Srinivas
|

హైదరాబాద్: రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన బరాక్ ఒబామా, పోటీ పడి ఓటమిపాలైన మిట్ రోమ్నీ ఫలితాల అనంతరం చాలా హుందాగా స్పందించారు. అయితే ఇలాంటి సంఘటనలు మన దేశంలో చాలా చాలా తక్కువ. ప్రత్యర్థి గెలుపును ఒప్పుకునేందుకు మన నేతలు అస్సలు ఇష్టపడరు. పైగా కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారా అన్నట్లుగా ఎందుకు ఓడామో చెప్పేందుకు ప్రయత్నించడమే ఎక్కువగా ఉంటుంది.

పాలి'ట్రిక్': మనం ఇలా అమెరికా అలా

ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఓడిపోయిన ప్రత్యర్థి రోమ్నీపై ప్రశంసల వర్షం కురిపించారు. రోమ్నీ మంచి దేశభక్తుడు అని, పరిపాలనలో ఆయన సలహాలు తీసుకుంటానని చెప్పారు. ఆయన తనకు గట్టి పోటీ ఇచ్చారని చెప్పారు. రోమ్నీ కూడా అదే విధంగా స్పందించారు. తన ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరించారు! దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఒబామా గట్టెక్కిస్తారని తాను ఆశిస్తున్నానని చెప్పారు.

పాలి'ట్రిక్': మనం ఇలా అమెరికా అలా

మన దేశంలో ఇటీవల రాజకీయాలు కుటుంబాలను కూడా టార్గెట్ చేసుకుంటున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ - మోనికా లెవెన్‌స్కీ మధ్య ఉన్న ఎఫైర్ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ అపైర్‌ను ప్రతిపక్షాలు ఎక్కడా రాజకీయం చేయలేదు.

 పాలి'ట్రిక్': మనం ఇలా అమెరికా అలా

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్‌ను రూ.50కోట్ల గర్ల్ ఫ్రెండ్ అంటూ ఎద్దేవా చేశారు. ఇది వివాదాస్పదమైంది. మోడీ ఫ్యామిలీ రాజకీయాలపై మండిపడ్డ కాంగ్రెసు కూడా మోడీ పర్సనల్ లైఫ్‌ను రాజకీయాల్లోకి లాగింది. మోడీది తప్పుపట్టడంతో సరిపెట్టకుండా మోడీ మాజీ భార్య గురించి దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.

 పాలి'ట్రిక్': మనం ఇలా అమెరికా అలా

2009 సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ ఆ నెపాన్ని చిరంజీవి పైకి నెట్టింది. అందులో నిజం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఓటమిని హుందాగా స్వీకరించాలి. కానీ టిడిపి మాత్రం ఇప్పటికీ 2009 ఎన్నికల్లో ఓటమికి ప్రజారాజ్యమే కారణమని చెబుతుంటారు. పిఆర్పీ రాకుంటే తమ పార్టీ అధికారంలోకి వచ్చేదని, కాంగ్రెసు చిత్తుగా ఓడిపోయేదని చెబుతుంటారు. కేవలం ఇది టిడిపికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా పలు పార్టీలు తమ ఓటమికి వివిధ కారణాలు వెతుకుతుంటాయి.

పాలి'ట్రిక్': మనం ఇలా అమెరికా అలా

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కుట్ర ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపిస్తోంది. అయితే హెలికాప్టర్ ప్రమాదాన్ని కేవలం ఉప ఎన్నికల ప్రచారానికి ముందు, ఉప ఎన్నికల ప్రచారం సమయంలో ప్రస్తావించిన జగన్ పార్టీ ఆ తర్వాత దానిని ఊసెత్తడం లేదు. దీనిని టిడిపి, కాంగ్రెసు ప్రశ్నిస్తోంది. ఉప ఎన్నికల సమయంలోనే మాత్రం అది ఎందుకు గుర్తుకొచ్చిందని, అంటే రాజకీయ లబ్ధి కోసమే దానిని ఉపయోగించుకున్నారా అనేది విపక్షాల ప్రశ్న.

 పాలి'ట్రిక్': మనం ఇలా అమెరికా అలా

మన నేతలు కలిసి పని చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. తమ తమ పార్టీలు, రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజలు పట్టరు. ఓ పార్టీ అధికారంలోకి వస్తే మరో పార్టీ వెంటనే తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పని చేస్తామని వెంటనే స్టేట్‌మెంట్ ఇస్తుంది! కానీ అధికార పార్టీతో కలిసి అభివృద్ధిలో పాలు పంచుకుంటామని మాత్రం చెప్పారు. అధికారంలోకి వచ్చి పార్టీ కూడా అంతే ప్రతిపక్షాన్ని ఎక్కడా కలుపుకు పోయేందుకు ప్రయత్నించదు. ప్రభుత్వం ప్రజల కోసం పని చేసినా ప్రతిపక్షం అందులో తప్పులను వెదుకుతుంది. ప్రతిపక్షం నిజంగానే ప్రజల కోసం ఓ పోరాటం చేసిన అధికారపక్షం ఇది కేవలం రాజకీయం మాత్రమే అంటుంది.

అటు ఒబామా, ఇటు రోమ్నీ స్పందనను చూసిన మన ప్రజలు మన రాజకీయ నేతల వైఖరిని నెమరు వేసుకుంటున్నారు. రాజకీయం కోసం మన నేతలు ప్రత్యర్థి కుటుంబాలను టార్గెట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఓడిపోతే ప్రజలు ఆమోదించలేదని చెప్పకుండా ప్రత్యర్థులు అవినీతికి పాల్పడి గెలిచారనో, డబ్బులు పంచి గెలిచారనో చెప్పి సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. తక్కువ మెజార్టీతో గెలిచినా ఏదో సాధించినట్లుగా చెబుతారు.

ఒబామా గెలిచిన తర్వాత తాను రోమ్నీతో కలిసి పని చేస్తానని, ఆయన మంచి దేశభక్తుడు అని కొనియాడారు. రోమ్నీ కూడా ఒబామా గెలుపును అంగీకరించారు. మన నేతలు మాత్రం ప్రత్యర్థులు గెలిస్తే వారితో కలిసి పని చేస్తామని చెప్పిన దాఖలాలు మనకు కనిపించవు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పని చేస్తామని చెబుతారు. ఇలా చెప్పకుండా ఉండేందుకు గద్దెనెక్కే పార్టీలు సక్రమంగా ఉంటాయని లేదు. ప్రతిపక్షాన్ని కలుపుకుపోయే ప్రయత్నాలు చేయరు. పైగా ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తారు. మన నేతలు ముఖాముఖి చర్చకు సిద్ధంగా ఉండరు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Gujarat CM Narendra Modi tood potshots at Union Minister Shashi Tharoor's personal life, saying his wife was once his 50 crore rupee girl friend, a day after he made comeback in the Union Cabinet reshuffle.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more