కాంగ్రెసు మేధోమథనంలో చర్చకు రాని తెలంగాణ

Sonia Gandhi
సూరజ్ కుండ్: కాంగ్రెసు మేధోమథన సదస్సులో తెలంగాణ అంశం చర్చకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్టంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏమీ మాట్లాడలేదు. అయితే, రాష్ట్రాలవారీగా మేధోమథన సదస్సులో జరగలేదని అంటున్నారు. అందుకే తెలంగాణ అంశం చర్చకు రాలేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రానికి చెందిన జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కిషోర్ చంద్రదేవ్ పాల్గొన్నారు.

2009 ఎన్నికల హామీల అమలుపై మరింత దృష్టి సారించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతలకు ఈ సదస్సులో పిలుపునిచ్చారు. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం సాధించాలని, ఇప్పటివరకు దృష్టి సారించని సమస్యలపై నేతలు మరింత శ్రద్ధ పెట్టాలని ఆమె కోరారు. మంత్రులు సమర్ధవంతంగా పనిచేసి, పార్టీ కార్యకర్తలకు మంత్రులు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస ఆమె సూచించారు. ఫలితాలే లక్ష్యంగా కృషి చేయాలని సోనియా పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ మేధోమథనం శుక్రవారం ఉదయం హర్యానాలోని సూరజ్ కుండ్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ 2014 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మంత్రులు, సీనీయర్లు అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని పార్టీ నేతలకు సోనియా దిశానిర్దేశం చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, మేనిఫెస్టోలో మిగిలిపోయిన హామీలపై తక్షణం దృష్టి సారించాలని, పార్టీ పటిష్టత కోసం ఆర్థిక వనరులను సైతం సమకూర్చుకోవాలని సోనియా సదస్సుకు హాజరైన నేతలనుద్దేశించి చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో పార్టీ కేడర్‌ను సంతృప్తి పరచడం లేదని, పార్టీ అవసరాలు, లక్ష్యాలతో సహా ప్రభుత్వ పరిమితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సోనియా సూచించారు.

యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. పలు నిర్ణయాల ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండటమే కాకుండా, అవినీతి కుంభకోణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో ఈ చర్చాగోష్టి జరుగుతోంది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సంస్కరణలకు సోనియా బాసటగా నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+