వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూరు కాంగ్రెసులో చిచ్చు: పార్టీ ఆఫీసుకు నిప్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress Logo
మహబూబ్‌నగర్: పాలమూరు కాంగ్రెసులో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్ పట్టణంలోని కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఇది జరిగింది. వెంటనే వాచ్‌మెన్, ఇతరులు మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు.

పోలీసులకు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయి. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కుర్చీలు, బల్లలు తదితర ఫర్నిచర్, పార్టీ జెండాలు, పలు బ్యానర్లు కాలిపోయాయి. ఎవరో ఉద్దేశ్య పూర్వకంగానే నిప్పు పెట్టి ఉండవచ్చుననే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు యువజన కాంగ్రెసు నాలుగు నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం ఉంది. ఆ తర్వాత డిసిసి మేధోమథన సదస్సు ఉంది. రెండు సమావేశాలు ఉన్న రోజు నిప్పు పెట్టడం పార్టీలోని విభేదాలు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందంటున్నారు. నిప్పు పెట్టిన వారు ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఎవరో ఒక వ్యక్తి ఉదయం వచ్చి సమావేశం ఉన్నందున పార్టీ కార్యాలయం తాళాలు ఇవ్వమన్నారని, రెండు నిమిషాల తర్వాత చూస్తే మంటలు చెలరేగాయని, ఆ తర్వాత తాళం చెవి తీసుకున్న వ్యక్తి పారిపోయాడని వాచ్ మెన్ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదని భావిస్తున్న వారు నిప్పు పెట్టారా లేక సమావేశంలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్న వారు నిప్పు పెట్టారా అనే చర్చ జరుగుతోంది. గతంలో రెండుసార్లు ఇలాగే నిప్పు పెట్టారు.

English summary
Unknown person set fire to Mahaboobnagar district Congress office on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X