వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫిడవిట్లో తప్పులు: రాహుల్‌పై విచారణకు ఈసి ఆర్డర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తన ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం(ఈసి) విచారణకు ఆదేశించింది. 2009 ఎన్నికల నామినేషన్ పత్రాల్లో రాహుల్‌ గాంధీ తన ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం పొందుపరిచారన్న జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి ఫిర్యాదుపై విచారణ జరపాల్సిందిగా అమేథీ రిటర్నింగ్ అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఈఓ)కు బుధవారం ఈసి ముఖ్య కార్యదర్శి ఆర్‌కె శ్రీవాత్సవ లేఖ రాశారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరచడం వాస్తవమేనని తేలితే రిటర్నింగ్ అధికారి తదుపరి చర్యలను కూడా చేపట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం సుబ్రమణ్య స్వామి ఫిర్యాదును ఆయనకు పంపాల్సిందిగా సీఈవోకు సూచించారు.

ఈ విషయమై తీసుకునే చర్యలను ఈసికి తెలియజేస్తుండాల్సిందిగా సూచించారు. అసోసియేటెడ్ జర్నల్స్‌లో రాహుల్‌ గాంధీకి ఉన్న షేర్ల వివరాలను ఆయన నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని ఇటీవల స్వామి ఆరోపించడం తెలిసిందే. కాగా, ఈ ఉదంతాన్ని తేలిగ్గా కొట్టిపారేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. ఈసి కేవలం పిటిషన్‌ను సిఈఓకు పంపిందే తప్ప తీర్పేమీ చెప్పలేదని పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. రాహుల్ తప్పేమీ చేయలేదన్నారు.

English summary
Acting on Janata Party chief Subramanian Swamy's complaint, the Election Commission has asked Amethi's returning officer to probe allegations that Congress leader Rahul Gandhi gave wrong information about his assets while filing his nomination papers for the 2009 polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X