కోమటిరెడ్డికి వైయస్ దోచి పెట్టారు: పాల్వాయి ఫైర్

తెలంగాణ వ్యతిరేకి అయిన వైయస్ కుమారుడు వైయస్ జగన్ పార్టీలోకి ఎలా వెళ్తారని ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ప్రశ్నించారు. కోమటిరెడ్డి సోదరులు పార్టీని వీడుతారని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని ఆయన గుర్తు చేశారు. వారికి ధనార్జనే ధ్యేయమని ఆయన అన్నారు. కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ తెలంగాణను వైయస్ రాజశేఖర రెడ్డి అడ్డుకున్నారని ఆయన అన్నారు. జగన్ పార్టీలోకి వెళ్లి తెలంగాణ ఎలా సాధిస్తారని ఆయన కోమటిరెడ్డి సోదరులను ప్రశ్నించారు.
కోమటిరెడ్డి సోదరులకు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా సహకరిస్తున్నారని ఆయన అన్నారు. ఆరోపణలు ఉన్న ప్రాజెక్టుల పనులను సమగ్రంగా పరిశీలించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితిలో కూడా జగన్ పార్టీని ఆదరించబోరని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి రాజన్న పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నెల్లూరులో జరిగిన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లక్షన్నర ఎకరాల మైనింగ్ భూములను బ్రదర్ అనిల్ కుమార్‌కు కట్టబెట్టారని మంత్రి తెలిపారు. వాన్ పిక్ పేరుతో పేదల నుంచి వేల ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్నారని ఆనం పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications