పాము కాటుకు విద్యార్థి మృతి, రైతు ఆత్మహత్య

పాము కాటుతో విద్యార్థి కేకలు వేశాడు. అరుపులు విన్న తల్లిదండ్రులు విషయం తెలుసుకుని అతన్న కర్నూలు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలోనే అతను ప్రాణాలు విడిచాడు. ఇటీవల హైదరాబాదు సమీపంలో కూడా ఓ విద్యార్థి పాము కాటుతో మరణించాడు.
రైతు ఆత్మహత్య
మెదక్ జిల్లాలోని దుబ్బాకలో శనివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. అంజయ్య అనే రైతు ఉదయం 7 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం సహకరించకపోవడంతో దుబాయ్ వెళ్లిన అంజయ్య ఏజెంట్ మోసంతో అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించ లేదు.
ఇండియా తిరిగి వచ్చిన ఆయన వ్యవసాయం చేసి అప్పులు తీరుస్తానని బాకీ దారులకు చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది వర్షాలు సరిగా పడకపోవడంతో పంటలు సరిగా పండలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అంజయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నవంబర్ నెలలో దుబ్బాకలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో అంజయ్య నాలుగోవాడు.












Click it and Unblock the Notifications