హీట్: సమావేశాలకు డిఎల్ డుమ్మా: వరదరాజులు ఫైర్

ఈ విషయంపై ఆయన సిఎస్, గవర్నర్‌కు లేఖ కూడా రాశారు. ఈ రోజు(బుధవారం) డిఎల్ స్పీకర్ నాదెండ్ల మనోహర్, గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. గవర్నర్‌ను కలిసిన ఆయన ధర్మాన సిబిఐ విచారణపై తనకు ఉన్న అభ్యంతరాలను తెలియజేశారు. తాను మంత్రివర్గంతో విభేదిస్తున్నట్లు గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. స్పీకర్‌ను కలిసి తాను వ్యక్తిగత పనుల వల్ల సమావేశాలకు హాజరుకానని తెలియజేశారు.
కాగా డిఎల్ రవీంద్రా రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కడప జిల్లాలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిఎల్ రవీంద్రా రెడ్డి రెండువేల కోట్లు సంపాదించారని, వాటిని ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆస్తులపై సిబిఐ విచారణకు ఆయన సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. కుట్రపూరిత రాజకీయాలతో ప్రొద్దుటూరు వాసులకు మంచినీటి పథకాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications