లబ్ధికే, అయినా ఓకె: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై చంద్రబాబు

'వస్తున్నా...మీకోసం' పాదయాత్రలో ఉన్న ఆయన నిజామాబాద్ జిల్లా మైలారం వద్ద శనివారం మీడియాతో మాట్లాడారు. జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ నిధులను కేటాయించాలని ప్రణాళిక సంఘం ఏనాడో చెప్పిందని ఆయన గుర్తుచేశారు. దళిత, గిరిజన సబ్‌ప్లాన్ బిల్లులో పదేళ్ల కాలపరిమితి పెట్టడం సరికాదన్నారు.
వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని ఉషా మెహ్రా కమిషన్ స్పష్టంగా చెప్పినా, కాంగ్రెస్ ఇప్పటి వరకు స్పందించడం లేదని ఆయన విమర్శించారు. తమ పార్టీ హయాంలో ఎస్సీ వర్గీకరణతో మాదిగ, ఉపకులాలకు 24,500 ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పారు.
దళిత, గిరిజన ఉప ప్రణాళిక బిల్లులో వర్గీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. శనివారం ఉదయం బాన్సువాడ నియోజకవర్గం మైలారం క్రాస్‌రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. దళితుల అభివృద్ధిపై కాంగ్రెసు పార్టీకి చిత్తశుద్ధి లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications