నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరూ మాట్లాడొద్దు: అఖిలపక్షంపై తమ్ముళ్లకు బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
నిజామాబాద్/హైదరాబాద్: అఖిలపక్ష సమావేశంపై ఇరు ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలు విధించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28వ తేదిన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు గురువారం స్పందించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, అఖిలపక్ష సమావేశానికి హాజరై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామని చెప్పారు.

అంతకుముందు ఉదయం ఆయన పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. తెలుగు తమ్ముళ్లకు అఖిల పక్షంపై ఏమీ మాట్లాడవద్దని సూచించారు. 28వ తేదిన జరగనున్న ఆల్ పార్టీ సమావేశంపై ఎవరూ మీడియాకు ఎక్కవద్దని సూచించారు. కేంద్ర హోంశాఖ విధివిధానాలు పరిశీలించాక స్పందించుదామని చెప్పారు. మనం అఖిలపక్షానికి హాజరై, నిర్ణయాన్ని వెల్లడించుదామని చెప్పారు. కేంద్రం విధి నిర్ణయాలు విడుదలయ్యే వరకు ఎవరూ మాట్లాడవద్దన్నారు.

కాగా చంద్రబాబు వస్తున్నా... మీకోసం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఉదయం బాసర సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 62వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. మైలాపూర్, త్రిపుల్ఐటీ మీదుగా ముదోల్ వరకు పాదయాత్ర సాగనుంది. ఈ రోజలు మొత్తం 16 కి.మీ మేర బాబు పాదయాత్ర కొనసాగనుంది.

తెలంగాణకు అనుకూలమని చెప్పాలి

తెలంగాణ ప్రాంతంలో పాదయాత్రలు చేస్తున్న నేతలు తెలంగాణకు తాము అనుకూలమని అఖిలపక్ష భేటీలో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. అఖిలపక్షం డిమాండ్ చేసిన పార్టీలు తమ విధానాలు మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తోందన్నారు. వైయస్ విజయమ్మ స్వయంగా అఖిల పక్షానికి హాజరై తెలంగాణకు అనుకూలమని చెప్పాలన్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu said today in Nizamabad district he is not against Telangana statehood. He was ordered party leaders don't respond on All Party meet till 28th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X