West Bengal: బెంగాల్ కొత్త సీఎం ఖరారు..! డిప్యూటీ సీఎంగా మహిళ..!

పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఓడించి ఘన విజయం అందుకున్న బీజేపీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది. బెంగాల్లో తొలిసారి ఏర్పడుతున్న తమ కలల ప్రభుత్వాన్ని కళ్లారా చూసుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్ కతా చేరుకున్నారు. బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల్ని ఖరారు చేసిన అమిత్ షా.. మరో ఉపముఖ్యమంత్రి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజీనామా చేయను, కావాలంటే..! మమతా బెనర్జీ తాజా సవాల్..!
రాజీనామా చేయను, కావాలంటే..! మమతా బెనర్జీ తాజా సవాల్..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీని వరుసగా రెండోసారి ఓడించిన సువేందు అధికారి (Suvendu Adhikari)ని బీజేపీ ఎంచుకుంది. ఇప్పటికే బెంగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మారిన సువేందుకు తొలి ముఖ్యమంత్రి ఛాన్స్ ఇవ్వాలని అమిత్ షా నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఆయనకు ఇద్దరు డిప్యూటీ సీఎంలను ఎంపిక చేయనున్నారు. ఇందులో ఒక ఛాన్స్ మహిళకు దక్కుతోంది. మహిళా డిప్యూటీ సీఎంగా అసోన్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికైన అగ్నిమిత్ర పౌల్ ను దాదాపు ఖరారు చేశారు.

BJP Eyes Suvendu Adhikari as Bengal s First BJP CM Agnimitra Paul in Line for deputy role
Mamata Banerjee: రాజీనామా చేయను..! మమత మరో బిగ్ షాక్..!
Mamata Banerjee: రాజీనామా చేయను..! మమత మరో బిగ్ షాక్..!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ కోల్‌కతాలో బీజేపీకి చెందిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించే అవకాశం ఉంది. సీఎంగా సువేందు పేరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ప్రతిపాదించారు. దీన్ని అమిత్ షా అధికారికంగా ప్రకటిస్తారు. మహిళా అలాగే ఎమ్మెల్యే అగ్నిమిత్ర పౌల్ తో పాటు రెండో డిప్యూటీ సీఎం పేరు కూడా ఈ భేటీలోనే ఖరారు అయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+