వేయి లారీల డబ్బు దోచుకున్నాడు: జగన్‌పై బాబు

జగన్ ఆక్రమ సంపాదనను స్వాధీనం చేసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్తు కోసం రైతులు పొలాల్లోనే పడుకుంటున్నారని, రైతుల సమస్యలను తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు ప్రజల పొట్టలు కొట్టారని ఆయన అన్నారు. పెట్టుబడులు లేకుండా, కష్టం లేకుండా వైయస్ జగన్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా డబ్బులు సంపాదించారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెసు నాయకులు దోచుకున్న సొమ్మంతా ప్రజల కష్టమని, ఆ సొమ్ము ప్రజలదని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే బీడీ కార్మికలకు 1500 రూపాయల చొప్పున పింఛన్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల పంటలను కొనే నాథుడు లేడని ఆయన అన్నారు. అన్ని సరుకుల ధరలు పెరిగాయని, దీంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన అన్నారు.
తాను అధికారంలోకి రావడానికి ముందు హైదరాబాద్, సికింద్రాబాదు మాత్రమే ఉండేవని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సైబరాబాద్‌ను అభివృద్ధి చేశానని, దాంతో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని, ప్రజల ఆదాయంతో పాటు ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, ఆ ఆదాయాన్ని ప్రజల కోసం ఖఱ్చు చేసి ఉంటే సమస్యలు తగ్గి ఉండేవని ఆయన అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు రైతులను సంక్షోభంలోకి నెడుతున్నాయని చంద్రబాబు విమర్శించారు. తన పాదయాత్రలో ఆయన పసుపు, వరి, పత్తి చేలను ఆయన పరిశీలించారు. రైతులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడాల్సి వస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications