జగన్ వ్యాపారంగా మార్చాడు, కిరణ్ అద్భుతం: బొత్స

Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం కాంగ్రెసు పార్టీ మేధో మధన సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఉదయం పదిన్నర గంటలకు ఎల్బీ స్టేడియంలో సదస్సు ప్రారంభమైంది. పిసిసి చీఫ్ బొత్స మొదట అధ్యక్షోపన్యాసం చేశారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ప్రస్తుత సిఎం కిరణ్‌లు మంచి పాలన అందించారని కితాబిచ్చారు.

కిరణ్ హయాంలో కాంగ్రెసు పథకాలు దిగ్విజయంగా అమలవుతున్నాయన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్ షిప్స్ పెంచిందని, రైతులకు, అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తోందన్నరు. పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నామన్నారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పైనా బొత్స ప్రశంసలు కురిపించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు దామోదర ఎంతో కృషి చేశారన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలతోనే పథకాలను ప్రారంభించారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేదని, ఇప్పుడు పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారన్నారు. పాదయాత్రలు చేసే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని షర్మిల, చంద్రబాబు పాదయాత్రలను ఉద్దేశించి అన్నారు.

సోనియా ఆదేశాలతో వైయస్ ఉచిత విద్యుత్ ప్రవేశ పెట్టారన్నారు. తెలంగాణ సమస్య రాష్ట్రాభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణ సున్నితమైన అంశమని, శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపించాలని తాను అధిష్టానాన్ని కోరుతానన్నారు.

అక్రమ సంపాదనతో పార్టీ స్థాపించాడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన బొత్స మండిపడ్డారు. జగన్ పార్టీ రాజకీయాలను వ్యాపారంగా మార్చిందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వంపు కుట్రలు చేస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+