ఢిల్లీ రేప్: నిందితుల తరఫున వాదనకు లాయర్లు నో

ఈ కేసుకు సంబంధించి పోలీసులు వేయి పేజీల చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఐదుగురు నిందితులపై అభియోగాలు మోపుతూ ఈ చార్జిషీట్ దాఖలు చేస్తారు. నిందితుల తరఫున ఏ న్యాయవాది కూడా వకాల్తా తీసుకోడని, అలా తీసుకోవడం అనైతికమని సాకేత్ జిల్లా బార్ కౌన్సిల్ సభ్యుడు, న్యాయవాది సంజయ్ కుమార్ అన్నారు.
కోర్టులో నమోదు చేసుకున్న 2,500 మంది న్యాయవాదులు కూడా నిందితుల తరఫున వాదనకు దూరంగా ఉండి, వేగంగా న్యాయం జరిగేలా చూస్తారని న్యాయవాదులు అంటున్నారు. ఆరో నిందితుడు మైనర్ కావడంతో అతనిపై జువైనల్ కోర్టులో విచారణ జరుగుతుంది. అతని వయస్సును నిర్ధారించుకోవడానికి అతనికి పోలీసులు ఎముకల పరీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.
23 ఏళ్ల వైద్య విద్యార్థినిని ఆరుగురు వ్యక్తులు ఇటీవల దారణంగా గ్యాంగ్ రేప్ చేసిన విషయం తెలిసిందే. ఆ అమ్మాయి చికిత్స పొందుతూ సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది. 13 రోజులు మృత్యువుతో పోరాటి ఆమె మరణించింది. ఆమె పేరును బయటపెడితే తమకేమీ అభ్యంతరం లేదని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు.


Click it and Unblock the Notifications