సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నాను: బాబు

మీకు పండుగ శుభాకాంక్షలు తెలపాలా అని ప్రజలను అడిగారు. అనంతరం ఆయనే తిరిగి కష్టం చేసుకున్నా మీ కష్టాలు తీరడం లేదని, పండుగ రోజున కూడా మీరు కూలి పనులు పోవాల్సిన పరిస్థితి ఉందని, పెరిగిన ధరలు, పెట్రోల్ ధరలు, విద్యుత్ చార్జీలు చూస్తుంటే మీకు పండుగ శుభాకాంక్షలు తెలుపలేక పోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తొమ్మిదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రాక్షస పాలన సాగిందన్నారు.
అందుకే అన్నివర్గాల బతుకులు చితికిపోయాయన్నారు. రాష్ట్రం చీకటి రాజ్యమైందని, అవినీతి పెచ్చు మీరిందని, కాంగ్రెస్ దొంగలు రాష్ట్రాన్ని దోచుకుని కోట్లు గడించారని, ఈ పరిస్థితి పోవాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఈ మార్పు మీ చేతుల్లోనే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అంధకార రాష్ట్రంగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. కరెంట్ ఇవ్వలేక ర్రాష్టాన్ని అంధకారంలో ఉంచారని, రాని కరెంట్‌కు బిల్లులు వసూలు చేస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికే ఆదర్శ ప్రదేశ్‌గా తెలుగుదేశం పార్టీ పాలనలో చూపిస్తే హైదరాబాదును అవినీతికి రాజధానిగా మార్చిన ఘనత కాంగ్రెస్ పాలకులదన్నారు. కేంద్రం నుంచి ర్రాష్టానికి నిధులు తేవడంలోనూ ఈ కిరికిరి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసులు ఒకే తానులోని ముక్కలన్నారు. అభివృద్ధి అంటే నై.. అవినీతి అంటే సై అనడమే ఈ పార్టీల సిద్ధాంతమని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications