రాయలుగా కన్నా కెవ్వుకేక: తుపాకీతో చిరంజీవి సరదా

Kanna Laxami Narayana
గుంటూరు: వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ శ్రీకృష్ణ దేవరాయలు వేషధారణలో అలరించారు. గుంటూరు జిల్లాలో శనివారం రాత్రి భువన విజయం నాటకం ప్రదర్శించారు. ఇందులో కన్నా శ్రీకృష్ణ దేవరాయలుగా కనిపించారు. మెలేసిన మీసంతో, మెడలో ముత్యాల హారంతో, కిరీటంతో శ్రీకృష్ణ దేవరాయుడిలా కనిపించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుంటూరు అమరావతి రోడ్డులోని అన్నదాన సమాజం ఆడిటోరియంలో భువన విజయం సాహితీ రూపకం ప్రదర్శించారు.

దేవరాయ పాత్రలో కన్నా సింహాసనాన్ని అధిష్టించారు. ప్రఖ్యాత కువులు తమ పాండిత్యాన్ని చాటారు. తెనాలి రామకృష్ణుడి పాత్రలో పింగలి కృష్ణా రావు హాస్యపూరిత ప్రసంగాలు చేశారు. కవులు ఒకరిపై మరొకరు సందర్భోచిత వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ రసవత్తర ప్రదర్శన ఇచ్చారు. శ్రీకృష్ణ దేవరాయలుగా కన్నా ప్రదర్శనకు స్టేజీ ఈలలు, కేకలతో అదిరిపోయింది. గతంలో కన్నా అసెంబ్లీ కల్చరల్ ఈవెంట్లలో కూడా పాల్గొన్నారు.

తిమ్మరుసుగా ప్రముఖ సాహితీ వేత్త పిఎస్సార్ ఆంజనేయ ప్రసాద్, అల్లసాని పెద్దనగా నరాలశెట్టి రవికుమార్, తిమ్మనగా మల్లాప్రగడన శ్రీమన్నారాయణ మూర్తి, ధూర్జటిగా రావూరి ప్రసాద రావు, అయ్యలరాజు రామభద్రునిగా డాక్టర్ జంధ్యాల మహతి శంకర్, మల్లన కవిగా సాహితీవేత్త మెట్ట వెంకటేశ్వర రావు, భట్టుమూర్తిగా రంగస్థల నటుడు, సాహితీవేత్త తుర్లపాటి రాధాకృష్ణ మూర్తి, కందుకూరి రుద్రన కవిగా చింతలపాటి నాగేశ్వర రావు, రాజనర్తకిగా రావెల నితీష‌లు కనిపించారు.

తెలుగు భాషను కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలని కన్నా లక్ష్మీ నారాయణ అనంతరం అన్నారు. కాంగ్రెసు ప్రభత్వం శ్రీకృష్ణ దేవరాయలను ఆదర్శంగా తీసుకొని పాలిస్తోందన్నారు. ఎప్పుడూ ఖద్దరు దుస్తులతో దర్శనమిచ్చే కన్నా ఇప్పుడు కొత్తగా కనిపించే సరికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం కనబర్చారు.

చిరంజీవి ఆనందం

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శనివారం విశాఖపట్నం జిల్లాలోని తుపాకీ పట్టుకొని ఆనందించారు. కాకినాడలో నిర్వహించిన సాగర ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం రాత్రి అతిథి గృహంకు వచ్చారు. శనివారం ఉదయం హైదరాబాద్ వెళ్లేందుకు విమానాశ్రయానికి బయలుదేరే సమయంలో ఎఆర్ విభాగం పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సమయంలో చిరు ఓ కానిస్టేబుల్ చేతిలో నుండి తుపాకీ తీసుకొని.. పక్కనే ఉన్నా మంత్రి గంటా శ్రీనివాస రావుతో... తాను ఎన్‌సిసిలో తుపాకీ కాల్చడంలో శిక్షణ పొందానని, ఎన్నో ఏళ్ల తర్వాత ఇలా పోలీసు తుపాకీని పట్టుకున్నానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+