ప్రణబ్ ఎదుట జై తెలంగాణ స్లోగన్: అదుపులోకి డాక్టర్

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎదుట ఓ వైద్యుడు గురువారం జై తెలంగాణ నినాదాలు చేశాడు. హైదరాబాదులోని హెచ్ఐసిసిలో 28వ ఆసలియా - ఫసిఫిక్ నేత్ర వైద్యుల సంఘం సదస్సులో ప్రణబ్ ముఖర్జీ ఎదుట డాక్టర్ నరేందర్ రెడ్డి అనే వైద్యుడు జై తెలంగాణ నినాదాలు చేశాడు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తుండగా ఆయన ఆ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా కలకలం బయలుదేరింది. వైద్యుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని బయటకు తీసుకుని వచ్చారు.

ఆసియా - ఫసిఫిక్ నేత్ర వైద్యుల సంఘం సదస్సును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారంనాడు ప్రారంభించారు. సదస్సు ప్రారంభోత్సవ సమావేశానికి గవర్నర్ నరసింహన్‌తో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సదస్సుకు ఈజిప్టు, రష్యా, పాకిస్తాన్ తదితర దేశాల నుంచి పది వేల మంది కంటి వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు హాజరయ్యారు.

Pranab Mukherjee-Kiran Kumar Reddy

ఈ సదస్సును ప్రారంభించడానికి ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వచ్చిన ప్రణబ్ ముఖర్జీకి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి తదితరులు స్వాగతం చెప్పారు. విమానాశ్రయం నుంచి ప్రణబ్ ముఖర్జీ నేరుగా హైటెక్స్‌కు చేరుకున్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తి కాగానే ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+