అక్బరుద్దీన్‌పై వ్యాఖ్యలు: కమలానందకు బెయిల్

అక్బరుద్దీన్‌పై చేసిన వ్యాఖ్యలపై హైదరాబాదులోని మీర్‌చౌక్, దబీర్‌పురా పోలీసు స్టేషన్లలో కమలానంద భారతిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో కమలానంద భారతిని పోలీసులు ఈ నెల 14వ తేదీన శ్రీశైలంలో అరెస్టు చేశారు. కమలానంద భారతిని ఒక రోజు పాటు తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఆ గొంతు తనదేనని అంగీకరిస్తూ తాను వ్యక్తిగత దూషణలకు దిగలేదని, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని కమలానంద భారతి పోలీసులకు చెప్పారు. కమలానంద భారతి గొంతును పోలీసులు పరీక్షలకు పంపించారు.
పోలీసులు ఈ నెల 14వ తేదీన అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు గతంలో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను హైదరాబాదులోని చర్లపల్లి జైలుకు తరలించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద కమలానంద భారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కమలానంద భారతి అరెస్టును విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) ఖండించింది. ఆయన అరెస్టుకు నిరసనగా ఆందోళనాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
స్వామి కమలానంద భారతి అరెస్టును నిరసిస్తూ పలు పీఠాధిపతుల స్వామిజీలు హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ వద్ద ఇటీవల ఆందోళన చేశారు. కమలానంద ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకున్నా పోలీసులు అరెస్టు చేశారని ఆరోపిస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం వారు కమలానంద అరెస్టుని నిరసిస్తూ గవర్నర్ భవన్‌కు వెళ్లారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని విడుదల చేశారు.
అయితే స్వామిజీలు మాత్రం పోలీసు స్టేషన్ వద్ద నుండి కదలలేదు. తమను ఎందుకు అరెస్టు చేశారు, ఎందుకు విడుదల చేశారని వారు పోలీసులను ప్రశ్నించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండానే కమలానందను అరెస్టు చేశారన్నారు. ఆయన కేవలం మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను ఉచ్చరిస్తూ వాటిని ఖండించారని, దానికే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications