మాయమాటలతో విద్యార్థినిని గర్భవతిని చేసిన టీచర్

విద్యార్థిని గర్భవతి అయినట్లుగా వైద్య పరీక్షల అనంతరం తల్లిదండ్రులు, గ్రామస్తులు గుర్తించారు. దీంతో వారు పాఠశాలకు వచ్చి వారు ఉపాధ్యాయుడు నాగేశ్వర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం అతనిని స్థానిక పోలీసులకు అప్పగించారు. విషయం తెలిసిన డిఇవో నాగేశ్వర్‌ను సస్పెండ్ చేశారు. కీచక టీచర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి అనుమానాస్పద మృతి
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మూడో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మార్కాపురం సమీపంలోని రాయవరం గ్రామంలోని సెయింట్ ఆన్స్ ఆంగ్ల మాధ్య పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న శాంసన్ అనే విద్యార్థి పాఠశాల వెనుకబాగంలో వెళ్లి బాటిల్‌లో తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడని సిబ్బంది చెబుతున్నారు. అరువులు విన్న స్థానికులు వచ్చి మంటలార్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందాడు. మార్కాపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ముగ్గురికి కత్తిపోట్లు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చేపల మార్కెట్లో శుక్రవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి కత్తిపోటు కారణంగా గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications