ఈవ్ టీజర్స్‌కి దేహశుద్ది: భర్తకోసం వెతుకుతుండగా రేప్

జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద వారిద్దరూ ఓ అమ్మాయి ఒక్కదానినే ఆటోలో చూశారు. ఆమెను దాదాపు రెండు కిలోమీటర్లు అనుసరించారు. సిగ్నల్స్ పడిప్పుడల్లా వారు తనను వేధించారని బాధిత అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి ఆటో డ్రైవర్‌కు చెప్పింది. అమ్మాయిని వేధించారని తెలుసుకున్న మరికొందరు కలిసి ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
సామూహిక అత్యాచారం
మతి లేని భర్తను వెతకబోయి సామూహిక అత్యాచారానికి గురైన వివాహిత (35) హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో చెట్టుకు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల రెండో తేదీన ఘోత్రు గ్రామానికి చెందిన వివాహిత తన భర్తను వెదికేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో పొరుగూరుకు చెందిన ముగ్గురు యువకులు ఆమెను.. ఎవరూ లేని ప్రాంతానికి లాక్కుపోయి అత్యాచారం చేశారు.
ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. జరిగిన దారుణాన్ని గ్రామ పెద్దలకు తెలపడంతో.. వారు పంచాయతీ పెట్టారు. నేరం చేసినట్టు ఆ యువకులు ఈ పంచాయతీలో అంగీకరించారు. పోలీసులకు తెలియజేస్తే మాత్రం తీవ్రపరిణామాలు ఉంటాయని బాధితురాలిని నిందితులు బెదిరించారు. దీంతో భయపడిన ఆమె శుక్రవారం రాత్రి చెట్టుకు ఉరి వేసుకుని మరణించింది.












Click it and Unblock the Notifications