కెసిఆర్ సరే, లగడపాటి మాటేంటి: మంత్రులకు జెఏసి

హైదరాబాదులోని గన్ పార్కు వద్ద నుండి బస్సు యాత్ర ప్రారంభమైంది. దీనిని ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్ ప్రారంభించారు. అంతకుముందు వారు తెలంగాణ అవరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు. ఈ నెల 24వ తేదిన ప్రజలు రోడ్ల పైకి వచ్చి సడక్ బందును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం జాప్యం వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే రీతిలో ఉద్యమం ఉంటుందని ఆయన అన్నారు. తమ టార్గెట్ అధికార కాంగ్రెసు పార్టీయే అన్నారు. పార్లమెంటులో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా పలువురు కాంగ్రెసు నేతలు మాట్లాడుతున్నా ఆ ప్రాంత మంత్రులు ఎందుకు స్పందించడం లేదని కోదండరామ్ ప్రశ్నించారు. ఇది సరి కాదన్నారు.
కాగా తెలంగాణ రాజకీయ జెఏసి బస్సు యాత్ర 11, 12 తేదీల్లో పాలమూరు జిల్లాలో సాగనుంది. తిమ్మాపూర్ నుంచి అలంపూర్ వరకు సడక్ బంద్ ప్రచార యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ఈ రెండు రోజుల పాటు కర్నూలు - హైదరాబాద్ మధ్య రహదారి ఉన్న ప్రాంతం గుండా సాగుతుంది.












Click it and Unblock the Notifications