చిరుపై కేసు ఎందుకు పెట్టరు, జగన్ సింహమే: షర్మిల

తన సోదరుడు వైయస్ జగన్ జైలులో ఉన్నా సింహమేనని ఆమె అన్నారు. ప్రజల్లో తేల్చుకుందామనే కాంగ్రెసు శానససభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ ఇంట్లో ఉన్న గదుల సంఖ్య జాతీయ సమస్యనా అని ఆమె అడిగారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో సంక్షేమ పథకాల అమలు ఆగిపోయిందని ఆమె విమర్శించారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయాయని ఆమె అన్నారు. వైయస్ బతికి ఉంటే ఎల్ఎల్‌బిసి సొరంగ పథకం పూర్తి అయి ఉండేదని అన్నారు. 2004 నుంచి 2009 వరకు ఆర్టీసి చార్జీలు పెరగలేదని ఆమె చెప్పారు. విద్యుత్తు చార్జీలు కూడా పెరగలేదని గుర్తు చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 47 లక్షల ఇళ్లు కట్టించిందని చెబుతూ ఈ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు కట్టించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు నిరుపేదలను పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. ప్రభుత్వం ఎడాపెడా పన్నులు వేస్తోందని అన్నారు. పదవులను కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీ బాట పట్టారని ఆమె అన్నారు.
ఏ ప్రాంతంలో చూసినా ప్రజలు కష్టాలు పడుతున్నారని, ఆ ప్రభుత్వంపై మంత్రులకే నమ్మకం లేదని షర్మిల అన్నారు. గీత కార్మికుడు చెట్టుపై నుంచి పడి మరణిస్తే లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆమె గుర్తు చేశారు. తెల్ల బంగారం అనే పత్తి పండించే రైతు పరిస్థితి దుర్భరంగా మారిందని, ఆ బంగారం లాంటి పత్తే రైతు ప్రాణం తీస్తోందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications