ప్రాణం తీసిన వివాహేతర సంబంధం: బస్సులోంచి దూకి

Guntur Dist
గుంటూరు/అదిలాబాద్: గుంటూరు జిల్లాలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. జిల్లాలోని వెల్దుర్తి మండలం దావులపల్లి తండాలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ భర్త శ్రీను అనే అతడిని హత్య చేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హతుడి బావమరిది ఆగ్రహంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను నరికాడు. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది.

ముందు జాగ్రత్తతో దూకి ప్రాణాలు కోల్పోయాడు

అదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడుకుందామని బస్సులో నుండి దూకి ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని సారంగాపూర్ మండలం వాంఖిడి ఘాట్ వద్ద ఓ ఆర్టీసి బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ బస్సును అదుపులోకి తీసుకు వస్తున్న సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇద్దరు ప్రయాణీకులు బస్సులో నుండి కిందకు దూకారు. డ్రైవర్ చాకచక్యం కారణంగా బస్సుకు పెను ప్రమాదం తప్పింది. అయితే, ప్రాణాలు కాపాడుకుందామని దూకిన వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్య

ఇద్దరు కూతుళ్లతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం బోయిళ్ల చిరివెళ్లిలో ఇది జరిగింది. కుటుంబ కలహాల కారణంగానే ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి ఆ తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అత్తింటి వేధింపులే కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+