తెలంగాణ ఎవడబ్బ సొమ్ము?: సర్వే, లగడపాటి వ్యాఖ్య

Sarve Satyanarayana
హైదరాబాద్: తెలంగాణ ఎవడబ్బ సొమ్మని, ఇక్కడ ఎవరైనా ఉండవచ్చునని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ సోమవారం అన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఆయన లోక్‌సత్తా అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వే మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ అంటూ జంట నగరాల్లో ఉంటున్న సీమాంధ్ర ప్రజలను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వంటి నేతల వ్యాఖ్యలు భయాందోళనలకు గురి చేసేలా ఉన్నాయని సర్వే మండిపడ్డారు.

తెలంగాణ ఎవడబ్బ సొమ్ముకాదని, ఎవరైనా ఉండవచ్చునన్నారు. సీమాంధ్ర ప్రజలు గో బ్యాక్ అంటూ తెరాస నాయకులు అంటున్నారని, వీరి వల్లే ప్రత్యేక రాష్ట్ర ప్రకటనలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. తెలంగాణ వస్తే సెటిలర్లు తమ భద్రత గురించి భయపడవద్దన్నారు. తాను వారికి అండగా ఉంటానని, ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని సర్వే సత్యనారాయణ హెచ్చరించారు.

లగడపాటి ఆసక్తికర వ్యాఖ్య

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నివాసంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, మాజీ మంత్రి కోమటిరెడ్డిల మధ్య సోమవారం ఆసక్తికర చర్చ సాగింది. రాష్ట్రం ఏర్పడ్డాక 54 ఏళ్లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే ముఖ్యమంత్రిగా ఉన్నారని, తమ ప్రాంతం అభివృద్ధి చెందలేదని లగడపాటితో కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. బీబీ నగర్‌లో నిమ్స్‌కి రూ.500 కోట్లు ఇమ్మంటే ఇవ్వడం లేదన్నారు.

అదిలాబాదు, కడపలో ఒకేసారి ప్రారంభించిన రిమ్స్ ఏ జిల్లాలో ఎలా అభివృద్ధి చెందాయో అందరికీ తెలుసునన్నారు. ఎప్పటికైనా తెలంగాణ ఇవ్వక తప్పదన్నారు. దీనికి లగడపాటి స్పందిస్తూ.. మీకు భవనాలైనా కట్టారని, విజయవాడలో మాకు అసలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రే లేదన్నారు. తెలంగాణకు మీరు ఎందుకు వ్యతిరేకమని కోమటిరెడ్డి ప్రశ్నించగా.. తాను వ్యతిరేకం కాదని, అందుకే కలిసి ఉండాలంటున్నానని లగడపాటి జవాబిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+