పత్రిక చదివించి, వివరాలడిగి: అక్బర్ స్వర పరీక్ష పూర్తి

అయితే జడ్జి మాత్రం ఆరు నిమిషాల్లో అక్బరుద్దీన్‌చే ఓ ఉర్దూ పత్రికను చదివించడంతో పాటు అతని బయోడేటాను అడిగారు. అధికారులు అతని స్వర నమూనాను సేకరించారు. దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి వివాదాస్పద సిడిలలోన స్వరం, ఈ స్వరం ఒక్కటో కాదో తేల్చనున్నారు. అక్బరుద్దీన్ రిమాండు ఈ రోజుకు ముగియడంతో కోర్టు అతని రిమాండును ఈ నెల 26వ తేది వరకు పొడిగించింది. మరోవైపు అక్బరుద్దీన్‌కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
దానిని స్వీకరించిన కోర్టు బెయిల్ పిటిషన్ పైన వాదనలను ఈ నెల 14వ తేదికి వాయిదా వేసింది. వాయిస్ టెస్టు అనంతరం అక్బరుద్దీన్‌ను నిజామాబాద్ కోర్టు నుండి అదిలాబాదు సబ్ జైలుకు తరలించారు. అంతకుముందు అదిలాబాద్ జైలు నుండి అక్బరుద్దీన్‌ను ప్రత్యేక వాహనంలో నిజామాబాదుకు పోలీసులు తరలించారు.
కాగా అక్బరుద్దీన్‌కు వారం రోజుల క్రితం వాయిస్ టెస్టు జరిగినప్పటికీ అప్పుడు ఆయన గొంతు సహకరించలేదు. గత మంగళవారం నిర్మల్ మెజిస్ట్రేట్ ఎదుట గొంతు పరీక్షలు నిర్వహించారు. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి. అయితే అక్బర్ గొంతు మార్చి మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అక్బరుద్దీన్ గొంతు మార్చి మాట్లాడలేదని, అనారోగ్యం కారణంగా ఆయన గొంతు అలా వస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications