కత్తులతో దాడిలో ఇద్దరి మృతి, చంపేయాలంటూ

ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా కూతురు భార్గవి మృతి చెందింది. భార్య శకుంతల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దినకరన్ పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో మొత్తం ఐదుగురు పాల్గొన్నట్లుగా స్థానికులు గుర్తించారు.
స్థానికులు వారిని పట్టుకొని చితకబాదారు. స్థానికులు చూడటంతో ఐదుగురిలో ఇద్దరు పారిపోయారు. మరో ముగ్గురు ఇంట్లోనే ఉండిపోయారు. వారిని స్థానికులు చితకబాదారు. పోలీసులు వచ్చి ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. మొదట ఒక వ్యక్తని పోలీసులు పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరు ఓ గదిలో గడియ వేసుకొని లోపలే ఉండిపోయారు. పోలీసులు వారిని బయటకు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ముగ్గురు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు.
నిందితులను కాల్చి చంపేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. వారు పోలీసు జీపును చుట్టుముట్టారు. భార్గవి కుటుంబంపై దాడి చేసిన వారి బతకడానికి వీలులేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వెంటనే షూట్ చేసి చంపాలని పోలీసులను కోరారు. కాగా ఈ ఘటనకు ప్రేమ వ్యవహారనే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. భార్గవి ఎంబిబిఎస్ చదువుతోంది.












Click it and Unblock the Notifications