వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ స్వీప్: 90 శాతం ముస్లింలు బిజెపికే ఓటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Narendra Modi
యూఢిల్లీ: ముఖాముఖి పోరులో బిజెపి సలయా మున్సిపల్ ఎన్నికల్లో చరిత్ర సృష్టించింది. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ద్వారకా జిల్లాలోని సలయా పట్టణం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉన్న 27 సీట్లను బిజెపి గెలుచుకుంది. ఇది గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అద్భుతమైన విజయంగా చెప్పవచ్చు. మెగా పవర్ ప్రాజెక్టుకు పేరు మోసిన సలయా ఇప్పుడు నరేంద్ర మోడీకి అభివృద్ధి ఎజెండాకు ప్రజలిచ్చిన మద్దతు చిహ్నంగా ప్రఖ్యాతి గాంచనుంది.

బిజెపి నిలబెట్టిన 27 మంది అభ్యర్థుల్లో 24 మంది ముస్లింలే. మిగతా ముగ్గురు హిందువుల్లో ఒకరు ఎస్టీ. బిజెపి అభ్యర్థులకు 90 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది వార్డుల్లో విస్తరించిన 27 సీట్లలో నలుగురు బిజెపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 23 సీట్లకు ఆదివారం పోలింగ్ జరిగింది. కాంగ్రెసు బిజెపితో ముఖాముఖి తలపడింది. కాంగ్రెసు పార్టీ అన్ని సీట్లలో ఓడిపోవడమే కాకుండా మూడు సీట్లలో ధరావత్తు కోల్పోయింది.

సలయా ఎస్సార్ ఎనర్జీస్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జిక్ కంపెనీ స్థాపించిన 1200 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఫలాలను అనుభవిస్తోంది. సలయా ఎస్సార్ ఎనర్జీ తొలి బొగ్గు ఆధారిత విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల. దాన్ని 1.1 బిలియన్ డాలర్ల వ్యయంతో నెలకొల్పారు. ఇది ఉత్పత్తి చేసే విద్యుత్తును దీర్ఘకాలిక కాంట్రాక్టుపై గుజరాత్ రాష్ట్ర ఎలక్ట్రిక్ యుటిలిటీ జియువిఎన్ఎల్‌కు సరఫరా చేస్తుంది. అన్ని యూనిట్లు పని చేయడం ప్రారంభిస్తే 2000 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది.

అత్యాధునాత సౌకర్యాలతో సలయాలో ప్రపంచ శ్రేణి మెరైన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కూడా వస్తోంది. జెట్టీని సలయా హార్బర్‌లో నెలకొల్పారు. సలయాలో ఎస్సార్ సామాజిక అభివృద్ధి చర్యల కింద పలు ప్రాజెక్టులను చేపట్టింది. మహిళా సాధికారత కోసం ఎస్సార్ ఫౌండేషన్ సలయాలో ఓ స్టిచ్చింగ్ సెంటర్‌ను నడుపుతోంది. అక్షరాస్యత, వ్యక్తిత్వ వికాసం, గణాంకాలు వంటి పలు విషయాల్లో ఆ కేంద్రం మహిళలకు శిక్షణ ఇస్తోంది.

English summary
It was a straight fight and the BJP created history by winning all 27 seats of town municipality in Salaya, a Muslim-majority town in Dwarka district. Salaya is know for its mega power project and now it will be known for giving Gujarat Chief Minister Narendra Modi another triumph in the development agenda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X