బజారు రౌడీల వ్యవహరించారు: చంద్రబాబుపై అంబటి

Ambati Rambabu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే సాక్షి పత్రిక కార్యాలయంపై దాడి జరిగిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబుపై రౌడీషీట్‌ తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. ఐదు రోజులుగా గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు సాక్షి పత్రికపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తూ టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.

బజారు మూకలతో దాడులు చేయించే స్థితికి, బజారు రాడీ వ్యవహరించే స్థాయికి చంద్రబాబు దిగజారారని ఆయన వ్యాఖ్యానించారు. రెండు సార్లు పరాజయం పాలైన చంద్రబాబుకు మూడో సారి అధకారంలోకి వచ్చే అవకాశం లేదని, అందుకే నిరాశానిస్పృహలకు లోనే ఇలాంటివి చేయిస్తున్నారని ఆయన అన్నారు. ఉన్నది ఉన్నట్లుగా రాసినందుకు సాక్షి పత్రిక కార్యాలయంపై పార్టీ కార్యకర్తలతో దాడులు చేయిస్తారా అని ఆయన అడిగారు.

సాక్షి పత్రిక కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో చంద్రబాబు అక్కడే ఉన్నారని ఆయన చెప్పారు. గతంలో కొన్ని పత్రికలపై దాడులు జరిగినప్పుడు పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగిందని చంద్రబాబు గగ్గోలు పెట్టారని, సాక్షిపై దాడి జరిగితే మాత్రం ఏమీ మాట్లాడడం లేదని ఆయన అన్నారు. కొన్ని పత్రికలు రోజూ పేజీల కొద్ది తమ నేత వైయస్ జగన్‌కు, తమ పార్టీకి వ్యతిరేకంగా ఒక ఎజెంజా ప్రకారం వార్తలు రాస్తున్నా వాళ్లను తాము ఏమీ అనడం లేదని, తాము దాడులు చేయలేదని ఆయన గుర్తు చేశారు.

తన కాలి గాయాన్ని సైతం రాజకీయం చేసిన తెలుగుదేశం నేతలకు షర్మిల విసిరిన సవాల్ నూటికి నూరు పాళ్లు సమర్థనీయమని రాంబాబు అన్నారు. ఓ వైపు తాను నోరు జారానని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అంగీకరిస్తూనే మరోవైపు పట్టుకోవడానికి షర్మిల కాళ్లు ఏమైనా బాగారానివా అని మరో వైపు అన్నారని, బంగారం కాళ్లు అయితే పట్టుకోవచ్చా అని ఆయన అన్నారు.

ముద్దుకృష్ణ నాయుడు గతంలో లక్ష్మీపార్వతి కాళ్లు, వైయస్ రాజశేఖర రెడ్డి కాళ్లు పట్టుకున్నారని, ఇప్పుడు చంద్రబాబు కాళ్లు పట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మీడియా లేదంటే నమ్మడం ఎలా అని ఆయన అడుగుతూ చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఒక టీవీ చానెల్‌నను బినామీ పేరుతో నడిపిన మాట వాస్తవం కాదా అని అన్నారు నిత్యం స్తోత్రం చేసే పత్రికలు ఉండగా చంద్రబాబు సొంత పత్రికలెందుకని అంబటి రాంబాబు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+