జగన్‌కు ఎదురు దెబ్బ: మాజీ ఎమ్మెల్యే తిరుగు టపా

శంబంగి చిన అప్పల నాయుడు మొదటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. దాదాపు ముప్పయ్యేళ్లు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించారు. 1985లో టిడిపి తరఫున పోటీ చేసి గెలిచారు. 1989లో అదే పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1999, 2004లలో టిడిపి తరఫునే పోటీ చేసిన ఓటమి చెందారు. ఆయన మొదటి నుండి బొబ్బిలి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ఉన్నారు.
కాంగ్రెసు పార్టీ నుండి విభేదించి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఆ పార్టీలో చేరారు. అయితే, బలహీన వర్గాలకు చెందిన వారికి పార్టీలో ప్రాధాన్యత లేదని, వారిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆయన కొద్ది రోజుల్లోనే పార్టీని వీడారు.
కాగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తున్న పలువురు ఇటీవల అసంతృప్తితో తిరిగి వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గాలి వీస్తుందని భావిస్తున్న పలువురు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే టిక్కెట్ తదితర అసంతృప్తి వల్ల కొందరు తిరిగి వస్తున్నారు.












Click it and Unblock the Notifications