అలకవీడిన కావూరి పార్లమెంట్‌కు: గేటు వద్ద తెలంగానం

ప్రధాన ద్వారం వద్ద తెలంగానం
బడ్జెట్ సమావేశాల తొలిరోజే పార్లమెంటుకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు.
కేంద్రం ప్రకటించిన తెలంగాణను వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణను ప్రకటించిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ బాధ్యత కేంద్రందే అన్నారు.
కాగా అంతకుముందు బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవనం నుండి పార్లమెంటుకు బయలుదేరారు. సంప్రదాయబద్ధంగా అశ్వారూఢులైన సిబ్బంది రాష్ట్రపతిని ఆయన ప్రత్యేక వాహనంలో పార్లమెంటు భవనానికి తీసుకు వచ్చారు.












Click it and Unblock the Notifications