హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఫల్యం లేదు, పట్టుకుంటాం: బాంబు పేలుళ్లపై సబిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల విషయంలో పోలీసుల వైఫల్యం గానీ, ఇంటెలిజెన్స్ వైఫల్యం గానీ లేవని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సబితా ఇంద్రారెడ్డితో పాటు డిజిపి దినేష్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, హైదరాబాద్ కమిషనర్ అనురాగ్ శర్మ పాల్గొన్నారు. సమావేశానంతరం సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.

పేలుళ్ల కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో వైఫల్యమంటూ చర్చ పెట్టడం సరి కాదని, ఒకవేళ వైఫల్యం ఉన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని ఆణె అన్నారు. తాము ఏ విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు. దర్యాప్తులో కేంద్ర దర్యాప్తు సంస్థ సాయం తీసుకుంటామని చెప్పారు. కేసు దర్యాప్తునకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఆరు నెలల కాలంలో నగరంలో 3500 సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామని, ఇందుకు 450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కొత్త నిర్మించే భవనాలు తప్పనిసరిగా సిసి కెమెరాలను అమర్చుకోవాలనే నిబంధనను పెడుతూ చట్టం తేవాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

దర్యాప్తు అధికారులు సిసిటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారని, నిందితులను గుర్తించే అవకాశం ఉందని ఆమె చెప్పారు. రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. దాడి చేసినవారికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చినవారికి భారీగా పది లక్షల రూపాయల బహుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమాచారం ఇచ్చినవారి వివరాలను గుప్తంగా ఉుంచుతామని చెబుతోంది.

దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటన విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని కాంగ్రెసు శానససభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాలను, గాయపడినవారిని ఆదుకుంటామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

English summary
The home minister Sabitha Indra Reddy has ruled out police and intelligence failure in averting Dilsukhnagar bomb blasts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X