లేటుగా తెరాస అవిశ్వాస నోటీస్!: ఇవ్వని జగన్ పార్టీ

Assembly
హైదరాబాద్: రెండో రోజు శాసనసభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభమయ్యాక ఆయా పార్టీలు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. విద్యుత్ కోతల పైన తెలుగుదేశం, వామపక్షాలు, మజ్లిస్ వైయస్సార్ కాంగ్రెసు, దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై భారతీయ జనతా పార్టీ, తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వాటిని స్పీకర్ తిరస్కరించారు.

దీంతో, సభలో గందరగోళం ఏర్పడింది. విపక్షాలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. తెరాస ఎమ్మల్యేలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను గంట పాటు వాయిదా వేశారు. పది గంటలకు తిరిగి సభ ప్రారంభం కానుంది.

అంతకుముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు బషీర్‌బాగ్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. వారు బషీర్‌బాగ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కరెంటు కోతలు, విద్యుత్ ఛార్చీల పెంపును నిరసిస్తూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కరెంటు కోతలకు నిరసనగా చేతిలో విసనకర్రలు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో సిపిఐ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

అవిశ్వాస నోటీసు ఇవ్వని తెరాస, వైయస్సార్ కాంగ్రెసు

ఈ రోజు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తామని చెప్పిన తెరాస నిబంధనల ప్రకారం ఇవ్వలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అసలే ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం సభ సమావేశం కావడానికి కనీసం అరగంట ముందు పార్టీలు శాసనసభ కార్యదర్శికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సభాపతి అసెంబ్లీలో వాటి విషయాన్ని ప్రస్తావిస్తారు. కానీ సమావేశాలకు అరగంట ముందు ఆ రెండు పార్టీలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వలేదు. దీంతో ఈ రోజుకు అవిశ్వాస తీర్మానం లేనట్లేనని చెప్పవచ్చు.

తెరాస అవిశ్వాస తీర్మానం

ఈ రోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అనువుగా సభా ప్రారంభానికి ముందే నోటీసు ఇవ్వని తెరాస... సభ ప్రారంభమై మొదటిసారి వాయిదా పడిన అనంతరం మాత్రం ఇచ్చింది. తెరాసతో పాటు బిజెపి, సిపిఐ, నాగం జనార్ధన్ రెడ్డి తదితర 25 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మాన నోటీసుపై సంతకాలు చేశారు. దీనిని తెరాస స్పీకర్‌కు అందించింది. నిబంధనల ప్రకారం ఇవ్వనందున స్పీకర్ దానిని స్వీకరించే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే, ఈ రోజుకు మాత్రం అవిశ్వాస తీర్మానం లేనట్లే! మరోవైపు అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ పలువురు పార్టీ నేతలతో భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+