సిట్టింగ్‌లపై, జగన్ క్యాంప్‌పై ట్రిగ్గర్: అవసరమైతే ఆజహర్

Kiran Kumar Reddy - YS Jagan
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీలోని పలువురు ప్రజా ప్రతినిధులకు టిక్కెట్లు దొరికే అవకాశం లేదా? అంటే అవుననే అంటున్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. సరిగా పని చేయని ప్రజాప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదని హెచ్చరిక జారీ చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా టిక్కెట్ ఆశించే వారు కష్టపడి పని చేయాలని హితవు పలికారు.

సిట్టింగులకు టిక్కెట్ ఇచ్చే అవకాశాలు కష్టమని చెప్పడం ద్వారా పార్టీ కోసం పని చేయకపోయినా, పక్క పార్టీల వైపు చూసే వారికి కిరణ్ హెచ్చరిక జారీ చేసినట్లయింది. అదే సమయంలో వారి వారి నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.

మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి నోటీసులు ఇస్తామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లిన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డిలు జంపింగ్‌లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు. కిరణ్ వ్యాఖ్యలతో జగన్ వైపు వెళ్లిన ప్రజాప్రతినిధులపై రెండు మూడు రోజుల్లో స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొత్స, కిరణ్, గండ్రలు ధిక్కార ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఇప్పటికే చర్చించినట్లుగా తెలుస్తోంది. గోడ దూకిన ఏడుగురిపై చర్యలు తీసుకునేందుకు సిఎల్పీ పత్రాలు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపి అజహరుద్దీన్ గురించి మాట్లాడారు. అజహర్ తన స్నేహితుడు అని, అవసరాన్ని బట్టి ఆయన సేవలు వినియోగించుకుంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+