మహిళ పట్ల అసభ్య ప్రవర్తన: రక్షించిన పేపర్‌ బాయ్స్

 Cab Driver arrested
హైదరాబాద్: రాజధానిలోని రాయదుర్గంలో గురువారం ఉదయం దారుణం జరిగింది. ఓ మహిళ పట్ల క్యాబ్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించారు. ఉదయం బాధిత మహిళ మార్నింగ్ వాక్ చేస్తుండగా.. క్యాబ్ డ్రైవర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె కేకలు వేసింది. దీనిని గుర్తించిన స్థానిక పేపర్ బాయ్స్ స్థానికులు ఆమెను క్యాబ్ డ్రైవర్ నుండి రక్షించారు. అతనికి దేహశుద్ధి చేశారు.

అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు ఇర్భాన్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. తాను మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని నీళ్ల కోసం కారును రోడ్డు పక్కన ఆపినట్లు నిందితుడు చెబుతున్నాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాజమండ్రి అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి 72 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో రాజమండ్రి, అమలాపురం, ఏలూరు తదితర ప్రాంతాల్లో పలు ఇళ్లలో చోరీకి పాల్పడి బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించారు.

పాలకొల్లుకు చెందిన ఈతకోట రాజ్ కుమార్ ముఠాకు నాయకుడు అని పోలీసులు తెలిపారు. పగలు సమయంలో చోరీలకు పాల్పడుతుండటం వీరి ప్రత్యేకత అని తెలిపారు. రాజమండ్రి మధ్య మండల డిఎస్పీ బాబ్జీ గురువారం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+