వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీగిన అవిశ్వాసం: తగ్గిన కిరణ్ బలం, జగన్ వైపు 9

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రతిపాదించిన తీర్మానం వీగిపోయింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత శనివారం తెల్లవారుజామున ఒంటి గంట దాటిన తర్వాత అవిశ్వాస తీర్మానంపై ఓటింగు జరిగింది. కాంగ్రెసు తిరుగుబాటు శానససభ్యులు 9 మంది, తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు సభ్యులు ఆరుగురు పార్టీల విప్‌లను ధిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. తెలంగాణ నగారా సమితి సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి, తెలుగుదేశం తిరుగుబాటు సభ్యులు వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి ఓటింగులో పాల్గొనలేదు. జయప్రకాష్ నారాయణ, టిడిపి తిరుగుబాటు సభ్యుడు చిన్నం రామకోటయ్య కూడా ఓటింగుకు దూరంగా ఉన్నారు.

ఏడుగురు సభ్యులున్న మజ్లీస్ ఓటింగుకు దూరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ తటస్థ వైఖరి అవలంబించింది. తెలుగుదేశం పార్టీ శుక్రవారం రెండోసారి తన సభ్యులకు రెండోసారి విప్ జారీ చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి పి. శంకర రావు సభకు వచ్చారు. చివరి నిమిషంలో ముఖ్యమంత్రి బుజ్జగించినా వినకుండా జోగి రమేష్ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు.

అవిశ్వాసానికి వ్యతిరేకంగా 142 మంది ఓటేశారు. అవిశ్వాసానికి మద్దతుగా 58 మంది సభ్యులు ఓటేశారు. 64 మంది సభ్యులు తటస్థ వైఖరి అవలంబించారు. 26 మంది గైర్హాజరయ్యారు.

కాంగ్రెసుపై తిరుగుబాటు చేసి వైయస్సార్ కాంగ్రెసుకు మద్దతుగా అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచిన 9 మంది సభ్యులు - జోగి రమేష్, సుజయ కృష్ణరంగారావు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మద్దాలి రాజేష్, గొట్టిపాటి రవికుమార్, శివప్రసాద్ రెడ్డి, అళ్లనాని, పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు అమర్నాథ్ రెడ్డి, వనిత, బాలనాగిరెడ్డి, అళ్ల నాని, ప్రవీణ్ రెడ్డి, సాయిరాజ్ జగన్‌కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు.

నిజానికి శాసనసభలో కాంగ్రెసు బలం 155. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా 142 ఓట్లు వచ్చాయి. మర్రి శశిధర్ రెడ్డి, కొర్ల భారతి శాసనసభకను హాజరు కాలేదు. దీంతో కాంగ్రెసు బలం సభలో 144కు పడిపోయింది. తాము నైతిక విజయం సాధించామని తెరాస సభ్యుడు హరీష్ రావు అన్నారు. సాంకేతికంగా మాత్రమే గెలిచిందని, గెలిచి ఓడిందని ఆయన అన్నారు. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిదని తేలిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చి ఉంటే ప్రభుత్వం పడిపోయి ఉండేదని ఆయన అన్నారు. చంద్రబాబు వల్లనే అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని, చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు.

English summary
No confidence motion proposed bt TRS is defeated. CM Kiran kumar Reddy has said that centre will take decission on Telangana issue.CM Kiran kumar Reddy has replied to the debate on no confidence motion proposed by Telangana Rastra Samithi (TRS) on his government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X