వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నష్టం జరగకూడదనే పెట్టడం లేదు: తెలంగాణపై సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ ఆకాంక్షకు నష్టం జరగకూడదనే తీర్మానం పెట్టడం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ లేవనెత్తిన విషయాలపై ఆయన ఆ విధంగా అన్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిందని, ఇక్కడ తీర్మానం చేయలేమని ఆయన అన్నారు. తెలంగాణ తీర్మానం పెడితే ఓడిపోతుందని, అందుకే పెట్టడ లేదని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మేరకు తీర్మానం పెడతామని ఆయన చెప్పారు. తమ తెలంగాణ ప్రాంత మంత్రులు, శాసనసభ్యులు కూడా పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణపై ఇంత చర్చ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత అది జరగకుండా చేసింది ఈ సభనే కదా అని తెరాస సభ్యుడు హరీష్ రావు అన్నారు. రాజకీయ పార్టీలు చెప్పినదానికి, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటే సభలో తీర్మానం పెడితే

నష్టం జరగదని ఆయన అన్నారు. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తే కేంద్రం వేగంగా నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రతిస్పందనకు ముందు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ - కాంగ్రెసు వివిధ సందర్భాల్లో తెలంగాణపై హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

తమ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాము అవిశ్వాసం పెట్టామని ఆయన చెప్పారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు పోరాటం చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజా సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కూడా తమకు ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ప్రజల కళ్లలో కారం కొట్టిందని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడారని ఆయన అన్నారు.

వేయి మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకుంటే మీరు చావకండి అనే భరోసా ఇవ్వని సభపై విశ్వాసం ఎందుకు ఉండాలని ఆయన అడిగారు. ప్రమాదాల్లో మరణిస్తే సంతాపం ప్రకటించే సభలు వేయిమంది బిడ్డలు చనిపోతే సంతాపం చెప్పని చట్టసభలపై ఎందుకు విశ్వాసం ఉండాలని ఆయన ప్రశ్నించారు. పార్టీ హామీ ఇచ్చిన తర్వాత అమలు చేయాల్సిన బాధ్యత లేదా అని ఆయన అడిగారు. కమిటీలతో తెలంగాణపై కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశాన్ని నాన్చుతున్న ఈ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. నీళ్లు, ఉద్యోగాలు దోచుకున్నారనే భావన తెలంగాణ ప్రజలకు ఉందని ఆయన అన్నారు

English summary
CM Kiran kumar Reddy has said that centre will take decission on Telangana issue.CM Kiran kumar Reddy has replied to the debate on no confidence motion proposed by Telangana Rastra Samithi (TRS) on his government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X