అక్రమ సంబంధం అనుమానం: భార్యల్ని చంపిన భర్తలు

 Husband kills wife
కడప/మెదక్: అక్రమ సంబంధం అనుమానంతో ఓ వ్యక్తి భార్యపై కత్తితో దాడి చేసిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. జిల్లాలోని పుల్లంపేట మండలానికి చెందిన శీనుకు కొంతకాలం క్రితం యానాదమ్మ అనే మహిళతో వివాహం అయింది. భార్యకు మరొకరితో సంబంధం ఉందని అతను అనుమానించాడు. ఆ అనుమానంతోనే అతను ఆదివారం ఉదయం భార్య నిద్రపోతున్న సమయంలో కత్తితో దాడి చేశారు.

దీంతో ఆమె అరిచింది. ఆమె కేకలు విన్న పక్కింటి మహిళ అక్కడకు పరుగెత్తుకు వచ్చింది. శీనును ఆమె నిలదీసింది. దీంతో అతను పక్కింటి మహిళ పైన కుడా దాడి చేశాడు. ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పక్కింటి మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

భార్యను నరికి చంపిన భర్త

మెదక్ జిల్లా గజ్వేలులో ఓ వివాహితను భర్త హత్య చేశాడు. సదరు వ్యక్తి ఇరవై నాలుగేళ్ల భార్యను శనివారం రాత్రి గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం అతను పోలీసులు ముందు లొంగిపోయాడు. కుటుంబ తగాదాల వల్లనే అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడాని సమాచారం. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది.

ట్రాక్టర్ బోల్తా

ఖమ్మం జిల్లా పినపాక మండలంలో ఓ క్రాసు రోడ్డు వద్ద ఈ రోజు ఉదయం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. డ్రైవింగులో అనుభవం లేని యువకుడు ట్రాక్టర్ నడిపినట్లుగా సమాచారం. ఈ ఘటనలో వేణు, గిరిశక్తి, సందీప్‌లు మృతి చెందారు.

స్మగ్లర్ల దాడి

తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరం మండలంలో అటవీ శాఖ అధికారులపై స్మగ్లర్లు దాడికి దిగారు. కలప అక్రమ నిల్వలను తనిఖీ చేస్తున్న సమయంలో స్మగ్లర్లు దాడి చేశారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+