వైయస్ వల్లే ఐఎఎస్‌లు జైలు పాలయ్యారు: బాబు

Chandrababu naidu
కాకినాడ: వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతి చర్యల వల్లనే ఐఎఎస్ అధికారులు జైలు పాలయ్యారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పార్టీని స్థాపించి 32 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన బుధవారంనాడు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం వద్ద పైలాన్‌ను ఆవిష్కరించారు. చంద్రబాబు పాదయాత్ర 2600 కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు.

ప్రజల సొమ్మును దోచుకోవడానికే కొంత మంది తమ పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. నిజాయితీగా ప్రజాసేవ చేద్దామని అనుకునేవారు పార్టీలో ఉంటున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అవినీతిని నిర్మూలిస్తే పేదరికం ఉండదని ఆయన అన్నారు. అవినీతిపరుల గుండెల్లో నిద్రపోవాలని, అవినీతి వ్యతిరేక పోరాటం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

తమ తొమ్మిదేళ్ల పాలనలో సైబరాబాద్ నగరాన్ని నిర్మించామని, అభివృద్ధి జరిగితే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. పరిస్థితులు భిన్నంగా ఉన్నా ఉప ఎన్నికల్లో విజయం తమదేనని ఆయన అన్నారు. తల్లి, పిల్ల కాంగ్రసుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన సూచించారు

విశ్వసనీయత అంటే దోచుకోవడం, దాచుకోవడం, జైలుకెళ్లడమా అని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఉద్దేశించి అన్నారు. అవినీతిపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పార్టీ శ్రేణులు నిరంతరం పోరాడాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+