తెర పైకి కేశినేని నాని: దేవినేనికి గద్దె సవాల్ వెనుక..!

Gadde Rammohan Rao - Devineni Umamaheswara Rao
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ పార్లమెంటు స్థానంపై తెలుగుదేశం పార్టీలో పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేశినేని నానిని ఇంఛార్జిగా నియమించారు. మరోవైపు పార్టీ సీనియర్ నేత గద్దె రామ్మోహన రావు మాత్రం అదే టిక్కెట్ కోసం తన ప్రయత్నాలు మాత్రం మానడం లేదు. ఇందుకోసం ఆయన బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు.

కేశినేని నాని కంటే ముందే గద్దె పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిసి విజయవాడ పార్లమెంటు స్థానాన్ని కోరినట్లుగా చెబుతున్నారు. మరోవైపు గన్నవరం స్థానాన్ని వల్లభనేని వంశీ ఆశిస్తున్నారు. జిల్లా టిడిపి అధ్యక్షుడైన దేవినేనికి వారితో అంతగా పడదు. దీంతో వారికి చెక్ చెప్పేందుకు కేశినేని నానిని దేవినేనే తెర పైకి తీసుకు వచ్చి ఉంటారనే ప్రచారం సాగుతోంది.

గన్నవరం టిక్కెట్ విషయంలో కూడా దేవినేని సిట్టింగ్ ఎమ్మెల్యేకు అండగా నిలబడుతున్నారు. అదే స్థానాన్ని వంశీ ఆశిస్తున్నారు. కేశినేని నానిని తెరపైకి తేవడంలో దేవినేని ఉమామహేశ్వర రావు పాత్ర ఉందని భావించడం వల్లనే గద్దె రామ్మోహన రావు అతనిని సోదరుడు దేవినేని నెహ్రూ పైన పోటీ చేయాలనే అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారంటున్నారు.

అయితే, గద్దె మాత్రం విజయవాడ ఎంపీ టిక్కెట్ పైన వెనక్కి తగ్గటం లేదు. అదే సమయంలో దేవినేని ఉమామహేశ్వర రావును కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, ఆయన సోదరుడు అయిన దేవినేని నెహ్రూ పైన పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బెజవాడ టిడిపిని సర్దుబాటు చేయలేక పార్టీ అధ్యక్షుడు సతమతమవుతున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+