ముగ్గురు పోలీసులకు ఉరిశిక్ష: 31 ఏళ్లకు తీర్పు

31 ఏళ్ల నాటి ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ కౌదియా సరోజ్, హెడ్ కానిస్టేబుల్ రామ్ నాయక్, కానిస్టేబుల్ రామ్ కరణ్‌లకు ఉరిశిక్ష విధించింది. పీఏసీ కమాండెంట్ రమాకాంత్ దీక్షిత్, ఎస్సైలు నసీమ్ అహ్మద్, మంగళ్ సింగ్, పర్వేజ్ హుస్సేన్, రాజేంద్ర ప్రసాద్ సింగ్‌లకు జీవిత ఖైదును విధిస్తూ తీర్పు వెలువరించింది.
సంఘటన వివరాల్లోకి వెళ్తే - 1982 మార్చి 12వ తేదీన గోండా జిల్లాలోని మాదోపూర్ గ్రామం వద్ద 13 మంది హత్యకు గురయ్యారు. మృతుల్లో డీఎస్పీతో సహా 12 మంది గ్రామస్థులు ఉన్నారు. వారిని పోలీసులే కాల్చి చంపారు. 12 మంది అమాయకులను బందిపోట్లుగా చిత్రీకరించారు. వారు డిఎస్పీ కెపి సింగ్‌ను కూడా కాల్చి చంపారు. అయితే డీఎస్పీ భార్య విభా సింగ్ మాత్రం దీన్ని ఎన్‌కౌంటర్‌గా అంగీకరించలేదు.
తన భర్తను పోలీసులే చంపి ఉంటారనే అనుమానంతో ఆమె న్యాయపోరాటం ఆరంభించారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు ఈ సంఘటనపై సమగ్ర విచారణ కోరుతూ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. సీబీఐ రంగప్రవేశంతో అసలు గుట్టు బహిర్గతమైంది. సాటి పోలీసులే తమ సహచరులను హతమార్చారని సీబీఐ నిర్ధారించింది.
19 మంది పోలీసులపై నేరాభియోగాలను నమోదు చేసింది. అయితే న్యాయ విచారణ 31 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగడంతో 10 మంది నిందితులు విచారణ మధ్యలోనే చనిపోయారు. మరో పోలీసు అధికారి ప్రేమ్ సింగ్‌పై మోపిన అభియోగాలు రుజురు కాకపోవడంతో ఆయన కేసు నుంచి బయటపడ్డారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications