సీతయ్యపై ఎదురుదాడి: సబిత జైలుకెళ్లబోతోందన్న దాడి

సబిత జైలుకు వెళ్లబోతున్నారు
కేబినెట్ అంతా దొంగలమయని ఆయన మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో తాజాగా సిబిఐ ఛార్జీషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని నాలుగో నిందితురాలిగా సిబిఐ పేర్కొంది. దీనిపై దాడి మండిపడ్డారు.
కేబినెట్ దొంగలమయమన్నారు. చేవెళ్ల చెల్లెమ్మ త్వరలో జైలుకు వెళ్లబోతోందన్నారు. ప్రభుత్వం కార్యక్రమాలతో పాటు చేవెళ్ల నుంచే వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సిగ్గులేకుండా పదవులలో కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతిపరుడన్నారు. ఆయన తమ్ముళ్ల అవినీతి చూస్తే ఆయన ఎంత నీతిమంతుడో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications