సా...గుతోంది: హరికృష్ణ, జూనియర్‌లతో జగన్ పార్టీ ఫ్లెక్సీ

Harikrishna and Junior NTR
కరీంనగర్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్లెక్సీలలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఓ వైపు ఫ్లెక్సీల అంశంపై రాజకీయంగా వేడెక్కడం మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తాను తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకే అండగా ఉంటానని చెబుతున్నప్పటికీ జగన్ పార్టీ ఫ్లెక్సీ రాజకీయాలకు ముగింపు పలకడం లేదు.

తాజాగా కరీంనగర్ జిల్లాలో మరో ఫ్లెక్సీ వెలిసింది. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోలతోనే జగన్ పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. తాజా కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో హరికృష్ణ, జూనియర్ ఫోటోలను పెట్టారు. జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గంలో జగన్ పార్టీ సమన్వయకర్త అజయ్ వర్మ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇందులో జూనియర్‌తో పాటు హరికృష్ణ ఫోటోను పెట్టారు.

విశాఖలో జగన్ పార్టీ వర్సస్ టిడిపి

విశాఖపట్నం జిల్లాలో బందు సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జగదాంబ సెంటరులో విద్యుత్ సమస్యలపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ ధర్నాలో లెఫ్ట్, బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే కారణమని టిడిపి మండిపడింది. దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కల్పించుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

కనిగిరిలోను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, టిడిపి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా బందు కొనసాగుతోంది. పాక్షిక ప్రభావం కనిపిస్తోంది. విపక్షాలు అన్ని బందులో పాల్గొంటున్నాయి. విపక్షాలు ఆయా బస్ డిపోల వద్ద కూర్చొని బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+